డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా వాయిదా పడిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన భీమ్ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ కు జోడీ గా ఎంపిక అయిన అలియా ఇప్పటివరకూ షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పుడు అలియా నవంబర్ 2వ తేదీ నుండి “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ మూవీ లో తన పాత్రకై అలియా తెలుగు భాష నేర్చుకొనడం విశేషం. “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: