ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలియా నటనపై రామ్ చరణ్ కూాడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.
టీజర్ అద్భుతంగా ఉంది సంజయ్ సర్. ఆలియా స్క్రీన్ ప్రజెన్స్ చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాన`ని చెర్రీ పేర్కొన్నాడు. ఇక, ఈ టీజర్‌పై రాజమౌళి స్పందిస్తూ.. `గంగూబాయిగా ఆలియా భట్ అద్భుతంగా కుదిరింది. వెండితెరపై సంజయ్ లీలా భన్సాలీ వర్క్ చూసేందుకు ఎదురుచూస్తున్నాన`ని ట్వీట్ చేశారు.
Superb Teaser Sanjay Sir!
Great screen presence @aliaa08
Looking forward to the film. https://t.co/NBJMTu9dJI #GagubaiKathiawadiTeaser— Ram Charan (@AlwaysRamCharan) February 24, 2021
కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: