కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!

Bollywood Actress Alia Bhatt Is Not A Part Of The Movie Confirms Acharya Movie Team

గత వారం రోజులుగా టాలీవుడ్ లో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు బాగానే వినిపిస్తుంది. దీనికి కారణం రెండు సినిమాలు. అదేంటి అలియా నటించేది ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే కదా ఇంకో సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..! అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటంతో.. ఒకవేళ ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్ అయినా అలియా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా నుండి అలియా నటించట్లేదు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనుకోండి. కాస్త లేట్ అయినా కూడా అలియా తోనే రాజమౌళి షూట్ చేస్తాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు గత రెండు రోజులుగా అలియా ఆచార్య సినిమాలో కూడా ఒక పాత్రలో నటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ – చిరు దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం అలియా ను చేయమని చరణ్ అడిగినట్టు.. అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవి కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అలియా ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే చేస్తుందని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here