ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంత బడ్జెట్ ఎందుకు సినిమా పోతే పరిస్థితి ఏంటి అనుకోడానికి అక్కడ ఉంది రాజమౌళి… స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్. కాస్త లేట్ అయినా జక్కన్న మంచి అవుట్ పుట్ వచ్చాకే సినిమాను వదులుతాడు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈసినిమా హక్కులు ఏ రేంజ్ లో అమ్ముడుపోయాయో చూశాం. దానికి కారణం బాహుబలి కూాడా అనుకోండి. ఈసినిమా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో తెలుసు కదా. ఆ సినిమా ప్రభావం కూడా ఆర్ఆర్ఆర్ పై పడింది. హాట్ కేకుల్లా
హక్కులను సొంతం చేసుకోడానికి పోటీ పడ్డారు. ఇక ఈసినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా అయిపోయింది. గత కొద్ది రోజులుగా పలానా వాళ్లకు ఆర్ఆర్ఆర్ రైట్స్ వెళ్లాయి అంటూవీటిపై వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేస్తూ అసలు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో ఆర్ఆర్ఆర్ టీం ఆ వివరాలన్ని ఓ పోస్టర్ ద్వారా తెలియచేస్తూ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్ నర్స్ వచ్చేసి జీ5, నెట్ ఫ్లిక్స్.. జీ5లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను ఎప్పటిలాగే స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఇక తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ కే దక్కాయి. హిందీ శాటిలైట్ రైట్స్ ను మాత్రం జీ గ్రూప్ సొంతం చేసుకుంది. మలయాళంలో ఏసియానెట్ దక్కించుకుంది.
ఇక విదేశీ భాషలు ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్ అండ్ స్పానిష్ భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: