మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న టైమ్ రానేవచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజుకావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక చెప్పినట్టే రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. రామరాజు లుక్ ను రిలీజ్ చేశారు. చేతిలో విల్లుతో చరణ్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక చరణ్ లుక్ ని చూసి అభిమానులు సంబర పడిపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The man of bravery, honour and integrity. Presenting my #AlluriSitaRamaraju to you all… 🔥 #RRR #RRRMovie @jrntr @ajaydevgn @aliaabhatt @oliviakmorris @alison_doody @thondankani @dvvmovies @RRRMovie pic.twitter.com/wA8VYMgYcG
— rajamouli ss (@ssrajamouli) March 26, 2021
కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇండియన్ సినిమాల్లో వస్తున్న అతి పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా అందరూ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూసి రెండేళ్ల పైన అవుతుండటంతో ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు.
స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: