ఆర్ఆర్ఆర్ – అలియా లుక్ కు టైమ్ ఫిక్స్

Alia Bhatt RRR Movie First Look Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,RRR,RRR Movie,RRR Telugu Movie,Alia Bhatt,Alia Bhatt Latest News,Alia Bhatt New Movie News,Alia Bhatt Upcoming Film Updates,Alia Bhatt Latest Movie Details,Alia Bhatt First Look From RRR,First Look Of Alia Bhatt From RRR Telugu Movie,Alia Bhatt Frist Look From RRR Movie,Alia Bhatt RRR Movie First Look,Alia Bhatt RRR Movie First Look Release Date,Alia Bhatt RRR First Look Update,Alia Bhatt RRR First Look Date

రాజమౌళి దర్శకత్వంలో భారీ పీరియాడికల్‌ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్‌ సీన్లతో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అలియా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఈ అమ్మ‌డి ఫ‌స్ట్ లుక్‌కు టైం ఫిక్స్ చేశారు మేక‌ర్స్. మార్చి 15న అలియా భ‌ట్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు ఉద‌యం 11గం.ల‌కు సీత పాత్ర పోషిస్తున్న అలియా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంద‌ని ప్రకటించారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =