పాన్ ఇండియా మూవీస్ లో అలియా భట్ ?

Bollywood Star Heroine Alia Bhatt Lines Up Two Other Pan Indian Movies

బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ” మూవీ తో హీరోయిన్ గా అలియా భట్ బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు . అలియా భట్ నటించిన “హై వే “, “2స్టేట్స్ “, హంప్టీ శర్మ కి దుల్హనియా “, “ఉడ్తా పంజాబ్”, “రాజి “, గల్లీ బాయ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “ఉడ్తా పంజాబ్”, “రాజి “, గల్లీ బాయ్ ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా ఆవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ అలియా “RRR” మూవీ లో కథానాయిక గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రా మ్ చరణ్ లు హీరోలుగా “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , రామ్ చరణ్ కు జోడీ గా నటిస్తున్నారు. ఈ మూవీ కై అలియా తెలుగు భాష ప్రాక్టీస్ చేస్తున్నారు. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. “RRR” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న అలియా భట్ మరో రెండు పాన్ ఇండియా మూవీస్ లో నటించనున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక మూవీ , బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ లోనూ కథానాయిక పాత్ర కై అలియా భట్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ వార్త నిజమైతే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అలియా భట్ టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.