కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Mahesh Babu

ట్యాగ్ · 87 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

నా అభిమాన క్రికెటర్ కోహ్లీ హ్యాపీ బర్త్ డే

స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్.. క్రికెట్ ప్రముఖులు నుండే కాదు సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కోహ్లీకి ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశాడు. `నా అభిమాన క్రికెటర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే ఎన్నో రికార్డులు సృష్టిస్తూ భార‌తదేశం గ‌ర్వపడేలా ఆడాలని కోరుకుంటున్నా. రాక్ ఆన్..` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Upcoming Movie Sarkaru Vari Paata To Hit Floors In January 2021
సాంగ్

2021 జనవరి నుండి 'సర్కారు వారి పాట'..!

ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయాడు. అయితే తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టారు. చాలా సినిమాలు చివరిదశలోనే ఉండగా ముందు వారు మాత్రం షూటింగ్ లను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పిక్చర్ పర్ఫెక్ట్.. యాదృచ్చికం అనేది అసాధార‌ణం

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ కు సంబంధించి కానీ.. పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించి కానీ ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వుంటారు. అంతేకాదు పాత జ్ఞాపకాలను కూడా అపుడప్పుడు గుర్తుచేసుకుంటుంది నమ్రత. ఇక ఇప్పుడు తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక తన పెళ్లి ఫొటో పోస్ట్ చేస్తూ పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్.. అప్పుడు.. ఇప్పుడు.. యాదృచ్చికం అనేది అసాధార‌ణం. జీవితంప‌రిపూర్ణంగా సాగుతుంటుంది. పెళ్ళిళ్ళు స్వ‌ర్గ లోకంలో జ‌రుగుతుంటాయి అని కామెంట్ పెట్టింది. న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటో నెటిజ‌న్స్‌ని…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Sends Out Birthday Wishes To Shahrukh Khan On Twitter With A Throwback Picture
సినిమా వార్తలు

అత్యంత సౌమ్యుడు షారుఖ్ కు బర్త్ డే విషెస్

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. అంతేకాదు పలు విషయాలను కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థాయ్ ల్యాండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ టైమ్ స్పెండ్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన మహేష్ దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ మీసం లుక్ పై నమ్రత రియాక్షన్

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. హాలీవుడ్ హీరో లకు పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉండగా మహేష్ ను మీసంతో చూసిన సందర్భాలు చాలా తక్కువే. మ్యాగ్జిమమ్ క్లీన్ షేవ్ లోనే ఉంటాడు. అయితే ఇప్పుడిప్పుడే కొత్త లుక్‌లలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపించే మహేష్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'స్టార్ ప్రొడ్యూసర్' కు 'సూపర్ స్టార్' విషెస్

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కేవలం వ్యక్తిగత విషయాలు..సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. మిగిలిన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూనే వుంటారు. ఇక ఈ రోజు అనిల్ సుంకర పుట్టిన రోజు కావడంతో ఆయనకు తన ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్నయ్యకు హాపీ బర్త్ డే - నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అన్నయ్య పుట్టిన రోజు కావడంతో తన అన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సోషల్ డైలమా' అన్నిటికంటే భయంకరం అంటున్న మహేష్

అప్పుడప్పుడు తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన పుస్తకాలను చదవమని.. అలాగే సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి కానీ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. గతంలో 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘డార్క్‌’ అనే పేరుతో తెర‌కెక్కిన జ‌ర్మ‌న్ వెబ్ సిరీస్‌ను చూశాన‌ని, ర‌చ‌న‌, దాన్ని తీసిన తీరు అత్య‌ద్భుతంగా ఉన్నాయ‌ని.. ఆ వెబ్ సిరీస్‌ను చూడాలంటూ త‌ను రెక‌మండ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా గురించి మహేష్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రెస్ట్ తీసుకోడానికి బెస్ట్ ప్లేస్.. నాన్నా నువ్వే బెస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు .. సితార సోష‌ల్ మీడియాలో ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే మైంటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంట్ ఉందో. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఎప్ప‌టిక‌పుడు ఏదో ఒక ఫొటోనో, వీడియోనో పోస్ట్ చేసి నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు స్మార్ట్ లుక్

బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మహేష్ బాబు సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మహేష్ బాబు "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ మోడ్ లో సూపర్ స్టార్

కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ భయంతో ఇప్పటివరకూ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్నగా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, కింగ్ నాగార్జున ఇప్పటికే షూటింగ్ లను స్టార్ట్ చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ కూడా షూటింగ్‌కు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అది సినిమా షూటింగ్ కాదులెండి .. ఏదో వాణిజ్య ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ బర్త్ డే శుంభాకాంక్షలు

ఈ రోజు (సెప్టెంబర్ 2 ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా "వకీల్ సాబ్ " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తనయుడికి ప్రేమతో బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఈ రోజు 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తనయుడికి మహేష్, నమ్రత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. మహేష్ తన ఇన్స్టా, ట్విట్టర్ లలో పసికందు గౌతమ్ ను ఎత్తుకున్న ఫొటో ను పోస్ట్ చేస్తూ.. 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉంది... హ్యాపీ 14.. నువ్వు యువ‌కుడిగా ‌ ఎదుగుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వ‌ర‌కు నీతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ప్ర‌త్యేకమైన‌ది. నీకు బెస్ట్ బ‌ర్త్‌డే విషెస్‌. ల‌వ్ యూ గౌత‌మ్" అని రాసుకొచ్చారు.

TFN Adminవాట్సాప్
Cute Picture of Superstar Mahesh Babu & Sitara
సినిమా వార్తలు

చిరు నవ్వులతో మహేష్ బాబు , సితార

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు కు తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్న విషయం తెలిసిందే. సితార తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో వీడియోస్ రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు . కుటుంబానికి అధిక ప్రాధాన్యత నిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేనెంతో అదృష్టవంతుడిని..!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోకు ఎలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారో తెలుసు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఇక ఈ ట్యాగ్ 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌‌గా రికార్డ్ సృష్టించింది. ఇంకా టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలెబ్రిటీస్ మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Blockbuster Movie Dookudu Goes To Bollywood.
సినిమా వార్తలు

"దూకుడు " మూవీ హిందీ రీమేక్

ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సౌత్ మూవీస్ ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇంతకు ముందు తెలుగు "పోకిరి " మూవీ "వాంటెడ్ ", "విక్రమార్కుడు " మూవీ "రౌడీ రాథోడ్ "గా హిందీ భాషలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. "అర్జున్ రెడ్డి " హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ భాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రీమేక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన బర్త్ డే ను జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యం లో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని మహేష్ బాబు అభిమానులను కోరారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేశారు.

Team TFNవాట్సాప్

షేర్