మహేష్ మీసం లుక్ పై నమ్రత రియాక్షన్

Namrata Shirodkar Shares A Candid Pic Of Mahesh Babu From His Recent Ad Shoot

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. హాలీవుడ్ హీరో లకు పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉండగా మహేష్ ను మీసంతో చూసిన సందర్భాలు చాలా తక్కువే. మ్యాగ్జిమమ్ క్లీన్ షేవ్ లోనే ఉంటాడు. అయితే ఇప్పుడిప్పుడే కొత్త లుక్‌లలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపించే మహేష్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నమత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌ మేకప్ వేసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. `కృత్రిమంగా ఉండేవి ఎప్పుడూ రియల్ గాకనిపించవు. వాటితో షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు కచ్చితంగా సౌకర్యవంతంగా లేదా సరదాగా ఉండదు. అయితే నిపుణులు ఉన్నప్పుడు సవాళ్లను ఇష్టపడనిదెవరు` అని నమ్రత కామెంట్ చేశారు. మరి చూద్దాం రియల్ గా మహేష్ పెద్ద మీసం పెంచితే ఎలా వుంటారో.. అది చూడాలంటే మాత్రం ఆ టైం వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nine =