అన్నయ్యకు హాపీ బర్త్ డే – నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే

Super Star Mahesh Babu sends out birthday wishes to his elder brother on twitter

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అన్నయ్య పుట్టిన రోజు కావడంతో తన అన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మా అన్నయ్యకు హాపీ బర్త్ డే. నిజం చెప్పాలంటే సినిమా గురించి నేను తెలసుకున్నది ఆయన వద్దే. ఆయనకున్న ఆ అంకితభావం, క్రమశిక్షణ, ఆ ప్యాషన్ అన్నీ నాకు పంచారు. నిత్యం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కృష్ణతో ఆయుదం సినిమాలో నటించాడు. బజారు రౌడీ చిత్రంలో మహేష్ బాబు తన అన్న రమేష్ బాబుతో కలిసి నటించాడు. పలు సినిమాల్లో నటించిన రమేష్ ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు.

ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‌

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 11 =