ట్యాగ్ · 87 కథనాలు · పేజీ 3
'లేడీ బాస్' కు హ్యాపీ బర్త్ డే
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
మరో చిన్నారికి అండగా నిలిచిన మహేష్
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సితార తో మహేష్ షాపింగ్
ఫేవరెట్ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ
'సూర్య' సినిమాపై 'మహేష్' ప్రశంసలు
మహేష్ బాబు హాలీవుడ్ లుక్
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్
మా గ్యాంగ్‌తో డిన్నర్
లైఫ్ ఈజ్ బ్యాక్ అంటున్న మహేష్ బాబు
అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత
'సర్కారు వారి పాట' లొకేషన్స్ కు మహేష్ ఫిదా
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా అవి వైరల్ అవుతున్నాయనుకోండి.
'దుబాయ్' లో సర్కారు వారి పాట
గత ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే 'సర్కారు వారి పాట' సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.
'లేడీ బాస్' కు హ్యాపీ బర్త్ డే
టాలీవుడ్ లోఉన్న బెస్ట్ కపుల్ లో మహేష్ బాబు దంపతులది మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫ్యామిలీకి మహేష్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. మరోపక్క నమ్రత కూడా ఇంటిని పిల్లల్ని చూసుకుంటూనే.. మహేష్ సినిమాలు, వ్యాపారాలు, ఫిట్ నెస్ ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మహేష్ బాబు గురించి తెలియాలంటే నమ్రత సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. మహేష్ బాబు చేసే అల్లరి, పిల్లలతో కలిసి చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా వుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలను…
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. నలభై సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అందం , ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు పోటీగా ఉంటూ మహేష్ బాబు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులలో మహిళా అభిమానులు కూడా అధిక శాతం లో ఉండడం విశేషం. కరోనా కారణంగా లాక్ డౌన్ లో 10 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ చేతుల మీదుగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ రిలీజ్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మరో డిఫరెంట్ థ్రిల్లర్ కథతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి `డబ్లూడబ్లూడబ్లూ` (హూ,వేర్,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే రానా చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఒక్కడు "మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న"ఒక్కడు" మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన "ఒక్కడు" మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరో చిన్నారికి అండగా నిలిచిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేదలకి ఆయన అండగా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్ జరిగిందని నమ్రత తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చిన్నారికి అండగా నిలిచాడు మహేష్.
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు నట ప్రస్థానానికి 41ఏళ్లు అయ్యాయి. అదేంటీ ఇటీవలే కదా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు కదా.. ఇప్పుడు 41 ఏళ్ళు అన్న డౌట్ వస్తుంది కదా. అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నీడ' అనే చిత్రంతో బాల నటుడిగా 1979లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా నేటితో 41 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు
ఢీల్లీ లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అది. ఇక ఈ ఘటన ఆధారంగా..దర్శకుడు రిచీ మెహతా దర్శకత్వంలో 'ఢిల్లీ క్రైమ్' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన ఘనత దక్కింది. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం హీరోస్ ఎంత ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం కూడా వారికి రికార్డ్స్ క్రియేట్ చేయడంతోనే సమానం. ఇక ఇప్పుడు అలాంటి ఒక రికార్డునే సొంతం చేసుకున్నాడు మహేష్.
సితార తో మహేష్ షాపింగ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫేవరెట్ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మాత్రమే కాదు పలు విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు తనకు సన్నిహితులైతే వారి పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేస్తాడు మహేష్. తన మేకప్ మెన్ పుట్టిన రోజును కూడా గుర్తుంచుకొని మరి విషెస్ చెప్పాడంటేనే అర్థంచేసుకోవచ్చు. ఇక ఈ రోజు తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అనిల్ రావిపూడికి బర్త్ డే విషెస్ తెలిపాడు.
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. ఈ సినిమాను అధికారికంగా ఈరోజు లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది. 2021 దసరాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
'సర్కారు వారి పాట' గ్రాండ్ లాంచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు.
'సూర్య' సినిమాపై 'మహేష్' ప్రశంసలు
సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాపై స్పందించి పొగడ్తలు కురిపించారు. నిన్నటికి నిన్న విజయదేవరకొండ ఈ సినిమా చూసి చాలా బావుందని చెప్పడంతో పాటు డైరెక్టర్ సుధా తో సినిమా చేయాలని వుందని కూడా తెలిపాడు. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా సూర్య, చిత్రయూనిట్ ను ప్రశంసించారు.
మహేష్ బాబు హాలీవుడ్ లుక్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు యంగ్ గా , అందంగా మారుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ తో మహేష్ టైమ్ స్పెండ్ చేశారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్
'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.
మా గ్యాంగ్‌తో డిన్నర్
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ వెళ్ళాల్సింది.. కానీ కరోనా వల్ల కుదర్లేదు. ఇక ఇన్నినెలలు తర్వాత ట్రిప్ కు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ ట్రిప్ కు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఫోటోని షేర్ చేశాడు. ఓ రెస్టారెంట్‌లో పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. `మా గ్యాంగ్‌తో డిన్నర్` అని కామెంట్ చేశాడు. నమ్రత కూడా తన ఇన్స్టాలో పలు…
లైఫ్ ఈజ్ బ్యాక్ అంటున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి కేటాయించాల్సిన టైంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు. అందుకే మహేష్ నీ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటారు. ఇక సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక ట్రిప్ కు వెళ్లడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఫ్యామిలీ ట్రిప్ వేసి ఆ తర్వాత పరుశురాం సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. గత ఏడెనిమిది నెలలుగా కరోనా వలన ఎక్కడికి వెళ్ళలేకపోయారు. కేవలం ఇంటికే పరిమితమై పిల్లలతో సరదా క్షణాలు గడిపారు.
అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత
సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య అయితే పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను తన ఇన్స్టాలో పంచుకుంది నమ్రత