ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సౌత్ మూవీస్ ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇంతకు ముందు తెలుగు “పోకిరి ” మూవీ “వాంటెడ్ “, “విక్రమార్కుడు ” మూవీ “రౌడీ రాథోడ్ “గా హిందీ భాషలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. “అర్జున్ రెడ్డి ” హిందీ లో “కబీర్ సింగ్ “గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ భాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రీమేక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ తెలుగు మూవీస్ “జెర్సీ “, అల.. వైకుంఠపురములో.. “, “HIT ” మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ బస్టర్ “దూకుడు “మూవీ హిందీ లో రీమేక్ కానుంది. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “దూకుడు “మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “దూకుడు “మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్ నేషనల్ స్వంతం చేసుకుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అవుతున్న ఈ రీమేక్ మూవీ లో సల్మాన్ ఖాన్ లేదా అజయ్ దేవగన్ హీరోగా రూపొందే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: