సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు .. సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే మైంటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంట్ ఉందో. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఎప్పటికపుడు ఏదో ఒక ఫొటోనో, వీడియోనో పోస్ట్ చేసి నెటిజన్లను పలుకరిస్తూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మహేష్ తను ఉన్న ఒక పాత ఫొటోను పోస్ట్ చేయగా అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహేశ్ అండ్ ఫ్యామిలీ హాలీడే ట్రిప్ కు విదేశాలకు వెళ్లిన సమయంలో మహేశ్ బాబు ఎయిర్ పోర్టు లాంజ్ సోఫా ఛైర్ లో కూర్చున్నపుడు సితార మహేష్ ఒడిలో నిద్రపోయింది. ఇక ఈ ఫొటో పోస్ట్ చేసి `రెస్ట్ తీసుకోడానికి ఇంతకన్నా మంచి స్థలం ఎక్కడుంటుంది? నాన్నా.. నువ్వే బెస్ట్` అంటూ నాన్న అంటే ఎంత ఇష్టమో తెలిపింది.
సినిమాలు షూటింగ్స్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకు లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. ఇక ఈ ఖాళీ సమయంలో పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి ఆటలు, పాటలు, కుకింగ్, స్విమ్మింగ్ అంటూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక నమ్రత అయితే మహేష్, గౌతమ్, సితారలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది నమ్రత.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























