
ట్యాగ్ · 25 కథనాలు


300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!

త్వరలో ప్రారంభం కానున్న కమల్ హాసన్ "ఇండియన్ 2"

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్

కరోనా నుండి కోలుకున్న 'కమల్'

నిలకడగా 'కమల్' ఆరోగ్యం

'కమల్' కు కరోనా పాజిటివ్

కబాలి డైరెక్టర్ తో కమల్..!

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కమల్ 'విక్రమ్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే

కమల్ 'విక్రమ్' షూటింగ్ రీ స్టార్ట్ కు డేట్ ఫిక్స్

కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్

కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ రిలీజ్

'దృశ్యం-2' రీమేక్- గౌతమి ప్లేస్ లో మీనా

38 సంవత్సరాల 'సాగర సంగమం'

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు
కమల్ హెల్త్ పై శృతి క్లారిటీ

ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో
మొత్తానికి అసలు ఈసినిమా ఉంటుందా?మళ్లీ సెట్స్ పైకి వెళ్లడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో తిరిగి షూటింగ్ ను ప్రారంభించుకుంది విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ అవ్వడం దానివల్ల షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. దాని తరువాత నిర్మాణసంస్థతో వివాదలు..దీంతో ఈసినిమా రావడం కష్టమనే అనుకున్నారు అందరూ. శంకర్ డైరెక్టర్, కమల్ హీరో, లైకా లాంటి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. వేరే…

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

త్వరలో ప్రారంభం కానున్న కమల్ హాసన్ "ఇండియన్ 2"
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన "ఇండియన్"(తమిళ ) , తెలుగు డబ్బింగ్ వెర్షన్"భారతీయుడు )1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సూపర్ హిట్ "ఇండియన్" మూవీ సీక్వెల్ "ఇండియన్ 2" తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ (?), సిద్ధార్ధ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!
లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. మా నగరం, ఖైది, మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్‌తో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జూన్3 న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాతో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కు మంచి హిట్ లభించింది. ఇక లోకేష్ హిట్ ఖాతాలో మరో సినిమా చేరింది.

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఖైదీ "మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "విక్రమ్ "తమిళ మూవీ 2022 మార్చి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. "విక్రమ్" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

కరోనా నుండి కోలుకున్న 'కమల్'
లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనాకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈవిషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు కమల్. ఈనేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆయన చెన‍్నైలోని శ్రీ రామచంద్రా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మధ్యలో ఒకసారి కమల్ హెల్త్ బాగానే ఉందని హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ బృందం ప్రకటించింది. కరోనా పాజిటివ్‌తో హాస్పిటల్‌లో జాయిన్ అయిన కమల్ హాసన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని, అయినప్పటికీ డిసెంబర్ 3 వరకు హాస్పిటల్‌లోనే ఉంటారని, డిసెంబర్ 4 నుంచి ఆయన తన…

నిలకడగా 'కమల్' ఆరోగ్యం
కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా కానీ ఇంకా పలువురు సెలబ్రిటీలు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా సూచించారు.

'కమల్' కు కరోనా పాజిటివ్
గత రెండేళ్లలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో చూశాం. ఎన్నో పరిశ్రమలు చాలా దెబ్బతిన్నాయి ఈ కరోనా ప్రభావం వల్ల. అలానే సినీ పరిశ్రమలు కూడా చాలా నష్టపోయాయి. ఎన్నో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఎన్నో వేల కోట్ల నష్టం జరిగింది. అలానే కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక గత కొద్దినెలలుగా పరిస్థితులు కాస్త సర్దుకోగా ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్…

కబాలి డైరెక్టర్ తో కమల్..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగాఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ తో సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని మరింత పెంచేశాడు. విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ పలువురు ప్రముఖలు నటిస్తుండగా రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందని ఇప్పటికే అర్థమైంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కమల్ 'విక్రమ్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులతో పాటు సినీలవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విక్రమ్ సినిమా నుండి ఇంట్రడక్షన్ టీజర్ విడుదలై అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. దీంతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా షూటింగ్ కూాడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. అయితే కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ లు పడ్డాయి.

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.

కమల్ 'విక్రమ్' షూటింగ్ రీ స్టార్ట్ కు డేట్ ఫిక్స్
ఈఏడాది విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు లోక నాయకుడుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు కూాడా రిలీజ్ అవ్వగా ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా రాబోతున్నట్టు అర్థమవుతుంది.

కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. ఇప్పటికే కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది.

కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మళ్లీ రీసెంట్ గానే ప్రారంభమైంది. కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'దృశ్యం-2' రీమేక్- గౌతమి ప్లేస్ లో మీనా
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబర్ 19న విడుదలై అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. ఇక తెలుగులో కూడా ఈసినిమా సీక్వెల్ వస్తుంది. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

38 సంవత్సరాల 'సాగర సంగమం'
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు ,కమల్ హాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం జూన్ 3, 1983 న తెలుగులో “సాగర సంగమం” తమిళంలో “ సలంగై ఓలి “ , “ మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు
కమల్ భగవద్గీత.. రజనీ దేవుడు అంటున్నాడు మన రాఖీ భాయ్ అదే కన్నడ సూపర్ స్టార్ యష్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న యష్ రజనీ కాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ గురించి చెప్పమని అడుగగా దానికి సమాధానంగా యష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. కమల్ హాసన్ నటనలో భగవద్గీత లాంటివాడని పెద్ద బిరుదే ఇచ్చేశాడు. రజనీకాంత్ ఏకంగా దేవుడని.. 'తలైవా' అని చెప్పాడు. బాలీవుడ్ బాద్షానేమో ఇన్ స్పిరేషన్ అంటూనే 'జీనియస్' అని కూడా కితాబునిచ్చాడు. నవాజుద్దీన్ సిద్ధీఖీ గురించి మాట్లాడుతూ.. ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్ ఆయనతో కలసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.
కమల్ హెల్త్ పై శృతి క్లారిటీ
కమల్ హాసన్ గతకొద్ది కాలంగా కాలికి సంబందించిన ఇన్ఫెక్షన్ తో భాదపడుతున్నారు. ఆమధ్య ఒక షూటింగ్ సమయంలో కమల్ కాలికి యాక్సిడెంట్ జరగడంతో అప్పుడు ఆపరేషన్ జరిగింది. అయితే ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా.. సినిమా షూటింగ్ లు.. మరో పక్క ప్రచారాలతో బిజీగా ఉండటంతో గాయం మళ్లీ తిరగపెట్టింది. దీనితో కమలహాసన్ కు చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో కమలహాసన్ చేరారని వైద్యులు…