లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. మా నగరం, ఖైది, మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్‌తో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జూన్3 న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాతో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కు మంచి హిట్ లభించింది. ఇక లోకేష్ హిట్ ఖాతాలో మరో సినిమా చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా విజయం సాధించడంటో లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఎమోషనల్ అయ్యింది లేదని విక్రమ్ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎంతో భావోద్వేగానికి నన్ను లోను చేస్తుంది అని తెలిపాడు. అలాగే దీనిని మళ్ళీ ఎలా తిరిగి ఇవ్వాలో కూడా అర్ధం కావట్లేదు. ఆడియెన్స్ కి నా హీరో కమల్ హాసన్ గారికి మిగతా నటులకి చాలా ఋణ పడి ఉంటానని లోకేష్ తెలిపాడు. ఇక లోకేష్ పోస్ట్ పై కమల్ స్పందిస్తూ సాలిడ్ రిప్లై ఇచ్చారు. నువ్వు ప్రేక్షకులకి ఏమన్నా తిరిగి ఇవ్వాలి అనుకుంటే అది మళ్ళీ నీ వర్క్ తోనే ఇవ్వు. నిజాయితీగా పని చేస్తూ వెళ్ళు వారి నుంచి ఎప్పుడూ నీకు ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది, నేను కూడా వారు అందించే ప్రేమాభిమానాల వల్లే అంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తాను. ఈ సినిమాకి సపోర్ట్ చేసినట్టు గానే మేము నిన్ను ఎప్పుడు సగర్వంగా సపోర్ట్ చేస్తాం ఇలాగే ఉండు” అంటూ కమల్ సాలిడ్ రిప్లై ఇచ్చారు.
The only way you can do any debt management with a loving audience is to never become complacent. Do honest back breaking work, they love and respect that. My energy comes from their love.All power to your endeavors. RKFI will proudly support you like we did this time. Rock on. https://t.co/C01Ek31QyG
— Kamal Haasan (@ikamalhaasan) June 5, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: