300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!

Kamal Haasan Opens Up About His Financial Status,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan About Financial Status,Kamal Haasan Opens about His Financial Status,Kamal Haasan Financial Status, Kamal Haasan Movies,Kamal Haasan Upcoming movies,Kamal Haasan latest Movie Updates,Kamal Haasan Vikram Movie Updates,Kamal Haasan Vikram Movie latest Updates, Vikram Tleugu Movie,Kamal Haasan Vikram Movie Collections,Vikram Movie Collections Updates,Vikram Movie Joins in 300 Crores Club,Vikram Movie Collected 300 Crores all Over the World, Kamal Haasan Vikram Movie Collections

లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మంచి హిట్లతో ఫామ్ లో ఉన్న లోకేష్ దర్శకత్వం వహించడం.. మరోవైపు కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్తో, సూర్య లాంటి వాళ్లు ఈసినిమాలో ఉండటంతో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకొని ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక లేట్ గా వచ్చినా కూడా కమల్ మరోసారి తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చూపించాడు. ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి మాట్లాడుతూ కమల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాతో 300 కోట్లు సంపాదిస్తానని గతంలో తాను చెపితే ఎవరూ నమ్మలేదని, కనీసం తన మాటలను అర్థం కూడా చేసుకోలేదని కమల్ చెప్పారు. ‘విక్రమ్’ సినిమా వసూళ్లతో ఇప్పుడు తన మాట నిజమైందని అన్నారు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నింటినీ తీర్చేస్తానని.. కుటుంబానికి, సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తానని చెప్పారు. డబ్బులు అయిపోయాక ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదని చెపుతానని అన్నారు. ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని పక్కవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.