కమల్ హాసన్ గతకొద్ది కాలంగా కాలికి సంబందించిన ఇన్ఫెక్షన్ తో భాదపడుతున్నారు. ఆమధ్య ఒక షూటింగ్ సమయంలో కమల్ కాలికి యాక్సిడెంట్ జరగడంతో అప్పుడు ఆపరేషన్ జరిగింది. అయితే ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా.. సినిమా షూటింగ్ లు.. మరో పక్క ప్రచారాలతో బిజీగా ఉండటంతో గాయం మళ్లీ తిరగపెట్టింది. దీనితో కమలహాసన్ కు చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో కమలహాసన్ చేరారని వైద్యులు వివరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కమల్ హెల్త్ పై శృతి కూడా ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. మీ అందరి ప్రేమ, అభిమానం , ఆశీర్వాదం వలన నాన్న శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని.. మరో నాలుగైదు రోజులలో తిరిగి ఇంటికి వస్తారని శృతి తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. నాన్నగారి ఆరోగ్యం విషయంలో శ్రీ రామ చంద్ర ఆసుపత్రి చాలా కేర్ తీసుకున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
On behalf of @ikamalhaasan here’s an update ! Thankyou for all the ❤️ pic.twitter.com/poySGakaLS
— shruti haasan (@shrutihaasan) January 19, 2021
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. మరోవైపు కమల్ ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: