శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన “ఇండియన్”(తమిళ ) , తెలుగు డబ్బింగ్ వెర్షన్”భారతీయుడు )1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సూపర్ హిట్ “ఇండియన్” మూవీ సీక్వెల్ “ఇండియన్ 2″ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ (?), సిద్ధార్ధ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొంత షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న”ఇండియన్ 2” సెట్స్ లో ప్రమాదం జరగడం,కరోనా కారణంగా షూటింగ్ రెండు సంవత్సరాలుగా నిలిచిపోయింది. తాజాగా “ఇండియన్ 2” మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా కమల్ హాసన్ నటించి , నిర్మించిన “విక్రమ్”మూవీ ఘనవిజయం సాధించడంతో కమల్ హ్యాపీ గా ఉన్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: