కమల్ భగవద్గీత.. రజనీ దేవుడు అంటున్నాడు మన రాఖీ భాయ్ అదే కన్నడ సూపర్ స్టార్ యష్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న యష్ రజనీ కాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ గురించి చెప్పమని అడుగగా దానికి సమాధానంగా యష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. కమల్ హాసన్ నటనలో భగవద్గీత లాంటివాడని పెద్ద బిరుదే ఇచ్చేశాడు. రజనీకాంత్ ఏకంగా దేవుడని.. ‘తలైవా’ అని చెప్పాడు. బాలీవుడ్ బాద్షానేమో ఇన్ స్పిరేషన్ అంటూనే ‘జీనియస్’ అని కూడా కితాబునిచ్చాడు. నవాజుద్దీన్ సిద్ధీఖీ గురించి మాట్లాడుతూ.. ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్ ఆయనతో కలసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం యష్ కె.జి.యఫ్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: