ఇండియన్ 2-10 మినిట్స్ డైలాగ్14 భాషల్లో

Kamal Haasan To Tell 10 Minutess Dialogues in 14 Languages, 10 Minutess Dialogues in 14 Languages, 14 Languages, Kamal Haasan To Tell 10 Minutess Dialogues, 10 Minutess Dialogues, Kamal Haasan, Indian 2 movie, Indian 2 Telugu movie, multi linguistic Dialogues, Ulaganayagan Kamal Haasan, Actor Kamal Haasan, Indian 2 movie Latest Update, Indian 2 movie New Update, Indian 2, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మొత్తానికి అసలు ఈసినిమా ఉంటుందా?మళ్లీ సెట్స్ పైకి వెళ్లడం కష్టం అనుకుంటున్న నేపథ్యంలో తిరిగి షూటింగ్ ను ప్రారంభించుకుంది విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో క్రేన్ యాక్సిడెంట్ అవ్వడం దానివల్ల షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. దాని తరువాత నిర్మాణసంస్థతో వివాదలు..దీంతో ఈసినిమా రావడం కష్టమనే అనుకున్నారు అందరూ. శంకర్ డైరెక్టర్, కమల్ హీరో, లైకా లాంటి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. వేరే ఇంకేదైనా సినిమా అయితే అటకెక్కేసి ఉండేది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీలైనంత త్వరగా శంకర్ కూడా ఈసినిమాను పూర్తిచేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో దాదాపు 10 నిమిషాలపాటు ఓ డైలాగ్ ఉంటుందట. అయితే ఆ డైలాగ్ ను కమల్ 14భాషల్లోనూ అదికూడా సింగిల్ టేక్ లో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కమల్ చెప్పిన డైలాగ్ కు సెట్స్ కూడా అందరూ షాకయ్యారట. మరి కమల్ వర్సిటాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా అలాంటి సీన్ ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి నిజంగానే ఇలాంటి సన్నివేశం కనుక ఉంటే థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం అని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =