38 సంవత్సరాల ‘సాగర సంగమం’

Versatile Actor Kamal Haasan Timeless Classic Sagara Sangamam Movie Completes 38 Years,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Tollywood News,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan Movie Updates,K Viswanath,K Viswanath Movies,Director K Viswanath,Kamal Haasan And K Viswanath,Kamal Haasan And K Viswanath Movie,38 Years For Sagara Sangamam Movie,38 Years For Sagara Sangamam,38 Years Of Sagara Sangamam Movie,38 Years Of Sagara Sangamam,Sagara Sangamam,Sagara Sangamam Movie,Sagara Sangamam Telugu Movie,Sagara Sangamam Telugu Full Movie,Sagara Sangamam Full Movie,Sagara Sangamam Songs,Sagara Sangamam Movie Songs,Sagara Sangamam Movie Updates,Sagara Sangamam 38 Years,Kamal Haasan Sagara Sangamam,38 Years For Kamal Haasan Sagara Sangamam,Kamal Haasan Sagara Sangamam Movie Completes 38 Years,SP Sailaja,Jaya Pradha,Sagara Sangamam Video Songs,Sagara Sangamam Telugu Movie Songs,#38YearsForSagaraSangamam,Sagara Sangamam Completes 38 Years,Sagara Sangamam Movie News,#SagaraSangamam

కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు ,కమల్ హాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం జూన్ 3, 1983 న తెలుగులో “సాగర సంగమం” తమిళంలో “ సలంగై ఓలి “ , “ మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్ లో అప్పటికే శంకరాభరణం లాంటి సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ సినిమా అదే కాంబినేషన్ లో వచ్చిన మరో సంచలన కళా ఖండం ” సాగర సంగమం “. భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా..సీఎన్ఎన్-ఐబీఎన్ వారి 100 గొప్ప భారతీయ చిత్రాల్లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది . అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం.

ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ , గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది . ఇక ఇళయరాజా సంగీతం … ఈ చిత్రానికి ఓ హై లైట్ . ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి . అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది . అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం.

అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు . జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని ఆల్ టైమ్ క్లాసిక్ గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు . కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి . అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు , ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత . సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వస్తుంది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.