
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
కమల్ హాసన్ న్యూ లుక్
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
'ఇండియన్ 2' - మృతుల కుటుంబానికి కోటి విరాళం

డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్
బాలనటుడిగా "కలత్తూర్ కన్నమ్మ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత "భారత రత్న "పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.
కమల్ హాసన్ న్యూ లుక్
బాలనటుడిగా కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ పలు సూపర్ హిట్ మూవీస్ తో 6దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ , బెంగాలీ భాషలలో సుమారు 220 మూవీస్ లో నటించిన కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా 4 నేషనల్ , 3 నంది , 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. యాక్టర్ , సింగర్ , రైటర్ , నిర్మాత , దర్శకుడు గా సినీ కళామ తల్లి కి చేసిన సేవలకు కమల్ హాసన్ ను "పద్మశ్రీ ", "పద్మ భూషణ్ " పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్.. కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
'ఇండియన్ 2' - మృతుల కుటుంబానికి కోటి విరాళం
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఇక కేసులు.. విచారణలు అంటూ తిరిగేలోపు కరోనా వచ్చేసింది. దీనితో అసలు షూటింగులే లేకుండా పోయాయి.