
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 62


గాయపడ్డ చరణ్ - షూటింగ్ బ్రేక్

రీల్ చంద్రబాబుకు వరుస ఆఫర్లు

థమన్ ఎస్ కు థ్యాంక్స్ చెప్పిన శివ నిర్వాణ

`96` తెలుగు రీమేక్ పట్టాలెక్కేది ఆ రోజేనా?

రెండు భాగాలుగా జయలలిత బయోపిక్?

ప్రభాస్ `బిల్లా`కి 10 ఏళ్ళు

గోపీచంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్?

అతిథి పాత్రలో సమంత

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రేమకథాచిత్రమ్ 2
మళ్లీ షూటింగ్ లోపాల్గొన్న విశాల్!

సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ

జీవా `కీ` రిలీజ్ డేట్ ఫిక్స్

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?

శాండిల్ వుడ్ లో సాయి పల్లవి

తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో అయినా ఈ ఉత్కంఠ కు బ్రేక్ పడుతుందేమో అనుకున్నారు కానీ.. మళ్లీ నిరాశే ఎదురురైంది. సినిమా రిలీజ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై ఇటీవల కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఏప్రిల్ 3న సినిమా చూసి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

గాయపడ్డ చరణ్ - షూటింగ్ బ్రేక్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూణె లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి చిన్న గాయమైంది. దీంతో చెర్రీని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో చిత్రీకరణ కూడా మూడు వారాల తర్వాతే కొనసాగించనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

రిలీజయిన పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్
ATV సమర్పణ లో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సీత మూవీ ఏప్రిల్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. సీత మూవీ లో కీలక మయిన ఒక ప్రత్యేక సాంగ్ ఉంది. ఆప్రత్యేక సాంగ్ లో నటించడానికి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ద్వారా యూత్ లో యెనలేని క్రేజ్ పొందిన పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. బెల్లంకొండ,కాజల్ జంటగా నటించిన రెండవ మూవీ సీత.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
మొదటి నుండి వివాదాలతోనే ప్రారంభమైన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల కూడా అవే వివాదాలతో విడుదలవ్వడం జరిగింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 29న విడుదలైన ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ మినహా.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినిమాకు మంచి టాకే వచ్చింది. తొలిరోజు మంచి ఓపెనింగ్సే రాబట్టింది. ఒకవైపు థియేటర్స్‌లో సినిమాలు ఏమీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా కాసులు కురిపిస్తోంది.

రీల్ చంద్రబాబుకు వరుస ఆఫర్లు
దేనికైనా టైమ్ రావాలి అన్న డైలాగ్ మనం చాలా మంది చాలా సందర్భాల్లో అన్నప్పుడు వినే ఉంటాం. అలా ఇప్పుడు ఆ మంచి టైమ్ శ్రీతేజ్ కు వచ్చినట్టుంది. దాదాపు 13 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా ఇంతవరకూ సరిగా రాని గుర్తింపు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ద టాక్ అయ్యాడు. గతంలో వర్మ సినిమా వంగవీటి లో దేవినేని నెహ్రూ పాత్ర షోషించిన శ్రీతేజ్.. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు.

థమన్ ఎస్ కు థ్యాంక్స్ చెప్పిన శివ నిర్వాణ
సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య, సమంత జంటగా నటించిన సెంటిమెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది . హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ క్రికెటర్ గా నటించడం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మజిలీ ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడు థమన్ ఎస్ మజిలీ మూవీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.

`96` తెలుగు రీమేక్ పట్టాలెక్కేది ఆ రోజేనా?
గత ఏడాది ద్వితీయార్ధంలో తమిళనాట సంచలనం సృష్టించిన చిత్రం `96`. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్... ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష పాత్రలో సమంత నటించనున్న ఈ సినిమాకి తమిళ వెర్షన్ డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 6న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్ మూవీ `తిరుగులేని మనిషి`కి 38 ఏళ్ళు
రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు ఒకే సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదైన విశేషం. అలాంటి... విశేషానికి చిరునామాగా నిలిచిన చిత్రం `తిరుగులేని మనిషి` కాగా... ఆ రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు మహానటుడు నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా నాటికి ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో దశాబ్దాలుగా కొనసాగుతుండగా... చిరంజీవి రైజింగ్ హీరోగా తన ప్రభావం చూపిస్తున్న రోజులవి. అలాంటి తరుణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్, చిరు... బావ - బావమరిది పాత్రల్లో నటించారు…

రెండు భాగాలుగా జయలలిత బయోపిక్?
భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి కథానాయికగా నిలిచిన ఘనత స్వర్గీయ జయలలితది. ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా రెండు బయోపిక్ మూవీస్, ఒక వెబ్ సిరీస్ రూపొందుతున్నాయి. `ది ఐరన్ లేడీ` అనే పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో జయలలిత పాత్రలో స్టన్నింగ్ పెర్‌ఫార్మర్ నిత్యా మీనన్ నటిస్తుండగా... తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న `తలైవి` (తమిళ్ టైటిల్)లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఇక వెబ్ సిరీస్‌లో ఎవర్‌గ్రీన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ... జయలలిత పాత్రలో దర్శనమివ్వనుంది.

ప్రభాస్ `బిల్లా`కి 10 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలలో `బిల్లా` ఒకటి. ఈ సినిమా కోసం ప్రభాస్ తొలిసారిగా అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను మురిపించాడు. అంతేకాదు... రెండు విభిన్న పాత్రల్లో (బిల్లా, రంగా) వేరియేషన్ చూపి మెప్పించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా అనుష్క, నమిత నటించగా ఓ ప్రత్యేక పాత్రలో హన్సిక దర్శనమిచ్చింది. కృష్ణంరాజు, జయసుధ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. ముఖ్యంగా... `బొమ్మాళి` పాట అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. 2009న…

గోపీచంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్?
పుష్కరకాలానికి పైగా కథానాయికగా రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఓ వైపు అగ్ర కథానాయకులతో నటిస్తూనే... మరో వైపు యువ కథానాయకులతోనూ జోడీ కడుతూ తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది ఈ ఉత్తరాది భామ. కాజల్ నటించిన కొత్త చిత్రాలు `సీత`, `పారిస్ పారిస్` (తమిళ్), శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీ... ఈ వేసవిలో తెరపైకి రానున్నాయి. అలాగే భారీ బడ్జెట్ మూవీ`భారతీయుడు 2`లో లోకనాయకుడు కమల్ హాసన్‌కి జోడీగా నటిస్తూ బిజీగా ఉంది కాజల్. అంతేకాదు... మాస్ మహరాజ్ రవితేజకి జంటగా `కనకదుర్గ`లోనూ కాజల్ నాయికగా నటించబోతోందని సమాచారం.

అతిథి పాత్రలో సమంత
కింగ్ నాగార్జున హీరో గా నటించిన మన్మథుడు మూవీ నాగార్జున సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రేమకథాచిత్రమ్ 2
RPA బ్యానర్ పై హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత నటించిన హారర్ కామెడి మూవీ బ్యాక్ టు ఫియర్ క్యాప్షన్ తో రూపొందిన ప్రేమకథాచిత్రమ్ 2 ఏప్రిల్ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ , ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని UA సర్టిఫికేట్ పొందింది.
మళ్లీ షూటింగ్ లోపాల్గొన్న విశాల్!
విశాల్ ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరగుతున్న నేపథ్యంలో విశాల్ గాయపడిన సంగతి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా విశాల్ కోలుకోవడంతో..మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ను అజర్బైజాన్ లో నిన్నటి నుంచే మొదలుపెట్టారట. అక్కడ అందమైన ప్రదేశాల్లో విశాల్ .. తమన్నాపై రెండు పాటలను, విశాల్ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట చిత్రయూనిట్.

సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ
నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

జీవా `కీ` రిలీజ్ డేట్ ఫిక్స్
`రంగం` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు జీవా. ఇప్పుడు మరోసారి `కీ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కలీస్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే సుకుమార్ చేతుల మీదగా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

పాయల్ పాటకు ముహూర్తం ఫిక్స్
కవచం తర్వాత మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీత. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వస్తుంది. టైటిల్ ‘సీత’ అయినా సినిమాలో కాజల్ ది సీత టైపు క్యారెక్టర్ కాదనే విషయాన్ని చూపించాడు డైరెక్టర్ . ఒళ్లంత అహంకారం నిండి ఉన్న పాత్రలో కాజల్ ఈ సినిమాలో నటించినట్టు టీజర్ ను చూస్తేనే అర్థమవుతోంది.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?
వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక సమంత.. ఈ వేసవిలో 'మజిలీ', 'ఓ బేబీ' చిత్రాలతో తెలుగునాట సందడి చేయబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించబోతోంది సామ్. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలోనూ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తమిళంలో ఘన విజయం సాధించిన '96' రీమేక్ లో కథా నాయికగా నటించబోతుంది సామ్. అంతేకాదు... మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ ఈ అందాల తార నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

శాండిల్ వుడ్ లో సాయి పల్లవి
మలయాళ చిత్రం “ప్రేమమ్” తో కథానాయికగా తొలి అడుగులు వేసింది సాయి పల్లవి. అంతేకాదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఫస్ట్ అటెంప్ట్ లోనే బెస్ట్ హిట్ ను అందుకుంది. వెనువెంటనే “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ పొందింది.

తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గడిచిన 50 సంవత్సరాలుగా తన అసమాన అభినయ ప్రతిభతో ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్నాడు ఈ ఎవర్ గ్రీన్ టాలెంటెడ్ స్టార్.