కవచం తర్వాత మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీత. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వస్తుంది. టైటిల్ ‘సీత’ అయినా సినిమాలో కాజల్ ది సీత టైపు క్యారెక్టర్ కాదనే విషయాన్ని చూపించాడు డైరెక్టర్ . ఒళ్లంత అహంకారం నిండి ఉన్న పాత్రలో కాజల్ ఈ సినిమాలో నటించినట్టు టీజర్ ను చూస్తేనే అర్థమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఓ స్పెషల్ సాంగ్ లో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను రేపు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరి`లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` తరువాత తేజ – కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావండంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ ఆంచనాలను వీరు రీచ్ అవుతారో? లేదో? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: