రీల్ చంద్రబాబుకు వరుస ఆఫర్లు

Reel CBN Shritej Bags Continuous Offers In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shritej Bags Crazy Projects, Reel CBN Shritej New Movies News,Shritej Next Film Updates,Shritej Upcoming Movies in 2019,Lakshmi's NTR Actor Shritej Next Movie Details
Reel CBN Shritej Bags Continuous Offers In TFI

దేనికైనా టైమ్ రావాలి అన్న డైలాగ్ మనం చాలా మంది చాలా సందర్భాల్లో అన్నప్పుడు వినే ఉంటాం. అలా ఇప్పుడు ఆ మంచి టైమ్ శ్రీతేజ్ కు వచ్చినట్టుంది. దాదాపు 13 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా ఇంతవరకూ సరిగా రాని గుర్తింపు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ద టాక్ అయ్యాడు. గతంలో వర్మ సినిమా వంగవీటి లో దేవినేని నెహ్రూ పాత్ర షోషించిన శ్రీతేజ్.. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాబు మేనరిజాన్ని శ్రీతేజ్ బాగా మ్యాచ్ చేయగలిగారని అంటున్నారు. లుక్స్‌, బాడీ మేన‌రిజ‌మ్స్ ఇలా అన్నీ విష‌యాల్లో కేర్ తీసుకుని.. ప్రతి సినిమాలో 100 శాతం నటనను కనబరచడానికి ప్రయ‌త్నించి సక్సెస్ అయ్యాడు. చంద్రబాబులాగ కనపడటానికి తాను చాలా కష్టపడ్డానని… 24 గంటలు చంద్రబాబు ఆలోచన తప్ప తనకు ఏం లేదని చెప్పిన శ్రీతేజ్.. తన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పొచ్చు.

మరి ఒకసారి మంచి పేరు వచ్చిందంటే ఆఫర్ల మీద ఆఫర్లు క్యూ కడుతూనే ఉంటాయి. అలా ఈ టాలెంటెడ్ యాక్టర్ శ్రీతేజ్ కు కూడా ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరి మంచి మంచి కథలతో.. విభిన్నమైన పాత్రలతో శ్రీతేజ్ ఇలానే కెరీర్ లో దూసుకుపోవాలని కోరుకుందాం..

[subscribe]

[youtube_video videoid=dd2hnWVwoO8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =