మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?

Samantha Signs Another Two Crazy Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha New Movie News,Actress Samantha Next Film Details,Samantha Bags a Two Crazy Projects,Samantha Akkineni Upcoming Movies in 2019
Samantha Signs Another Two Crazy Projects

వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక సమంత.. ఈ వేసవిలో ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలతో తెలుగునాట సందడి చేయబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించబోతోంది సామ్. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలోనూ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ రీమేక్ లో కథా నాయికగా నటించబోతుంది సామ్. అంతేకాదు… మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ ఈ అందాల తార నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ అనే పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో… నాని కి జోడిగా సమంత నటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో దిల్ రాజు నిర్మించనున్న సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత. మరి… ఈ రెండు సినిమాల్లోనూ సామ్ నటిస్తుందా? లేదా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రావచ్చు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.