మలయాళ చిత్రం “ప్రేమమ్” తో కథానాయికగా తొలి అడుగులు వేసింది సాయి పల్లవి. అంతేకాదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఫస్ట్ అటెంప్ట్ లోనే బెస్ట్ హిట్ ను అందుకుంది. వెనువెంటనే “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే తమిళ చిత్ర పరిశ్రమలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘దియా’ (తెలుగులో ‘కణం’) ద్వారా అక్కడ తొలి అడుగు వేసింది. కట్ చేస్తే.. ఈ డాన్సింగ్ బ్యూటీ ఇప్పుడు దక్షిణాదిలోని మరో చిత్ర పరిశ్రమ అయిన కన్నడ సీమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. నటి రక్షిత భర్త, ప్రముఖ దర్శకుడు ప్రేమ్ ఓ భారీ బడ్జెట్ మూవీ ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తోనే సాయి పల్లవి శాండిల్ వుడ్ కి హీరోయిన్ గా పరిచయం కాబోతోందని సమాచారం. ఇందులో ప్రేమ్ బావ మరిది హీరోగా నటిస్తాడని టాక్. త్వరలోనే సాయి పల్లవి కన్నడ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























