
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 61


నిర్మాతగా మారిన మలయాళ బ్యూటీ

ఎవడు తక్కువ కాదు టీజర్ కు ముహూర్తం ఫిక్స్

మజిలీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

మజిలీ మూవీ మౌత్ టాక్

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "ఎబిసిడి"

సాహో మూవీ జపనీస్ లో కూడా!

మన్మథుడు 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

మహర్షి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

2020 సంక్రాంతికి మూడు ఆసక్తికరమైన చిత్రాలు

బంగార్రాజు మూవీ లో హీరోయిన్ గా నయనతార ?

కలిసొచ్చిన దర్శకుడితో సూర్య చిత్రం?

శ్రీను వైట్ల సినిమాని కన్‌ఫర్మ్ చేసిన విష్ణు

చిత్రలహరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా దర్శకుడు క్రిష్

దిమాక్ ఖరాబ్ అంటున్న ఇస్మార్ట్ శంకర్

మన్మథుడు 2 మూవీ లో స్టార్ కపుల్
మనం ఎంటర్ ప్రైజెస్ , ఆనంది ఆర్ట్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా మన్మథుడు 2 మూవీ శరవేగంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మన్మథుడు 2 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హీరో నాగ చైతన్య, సమంత మన్మథుడు 2 మూవీ లో అతిథి పాత్రలలో నటించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు.

నిర్మాతగా మారిన మలయాళ బ్యూటీ
మొన్నటి వరకూ హీరోయిన్ గా తన నటనతో మురిపించిన అమలాపాల్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతుంది. అనూప్ పానికర్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో కెడవర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

ఎవడు తక్కువ కాదు టీజర్ కు ముహూర్తం ఫిక్స్
విక్రమ్ సహిదేవ్ అంటే ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ... "రేసు గుర్రం" సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో అలాగే "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాలో అన్వర్ పాత్రలో నటించి మెప్పించిన నటుడు అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీలో అయితే క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషనల్ నటనతో అందరినీ ఫిదా చేసేశాడు విక్రమ్ సహిదేవ్.

మజిలీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ జంట, రీల్ లైఫ్ జంటగా నటించిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుక గా ఈ రోజు రిలీజయింది. ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ తెచ్చుకున్న మజిలీ మూవీ నైజాం ఏరియా లో 200 థియేటర్లలో రిలీజ్ కావడం రికార్డ్. మోడల్ దివ్యాంశ కౌశిక్ ఒక కీలక పాత్రలో నటించారు. గోపిసుందర్ స్వరకర్త. సంగీత దర్శకుడు థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

మజిలీ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "ఎబిసిడి"
ఫైనల్లీ "ఎబిసిడి" సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ముందు మార్చి1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు... ఆ తరువాత మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా మార్చి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సాహో మూవీ జపనీస్ లో కూడా!
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈసినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షెడ్స్ ఆప్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వీడియోలు రిలీజ్ చేయగా అవి మిలయన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి.

మన్మథుడు 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలతో 2002లో వచ్చిన ‘మన్మథుడు’ ఎంత బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘మన్మథుడు 2’ తెరకెక్కుతుంది. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మహర్షి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా టీజర్ కు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

2020 సంక్రాంతికి మూడు ఆసక్తికరమైన చిత్రాలు
తెలుగువారికి ప్రీతిపాత్రమైన పర్వదినం సంక్రాంతి. అందుకే... ఆ సీజన్‌లో వచ్చే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది. ఏవో ఒకటీఅరా సందర్భాలను మినహాయిస్తే... ప్రతీ సంక్రాంతికి అగ్ర కథానాయకుల సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది కూడా అలానే... `యన్.టి.ఆర్. కథానాయకుడు` (బాలకృష్ణ), `వినయ విధేయ రామ` (రామ్ చరణ్), `ఎఫ్ 2` (వెంకటేష్) చిత్రాల రూపంలో టాప్ హీరోల సినిమాలు కనువిందు చేశాయి.

బంగార్రాజు మూవీ లో హీరోయిన్ గా నయనతార ?
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ 2016 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ బంగార్రాజు మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ను సంప్రదించగా, గ్రామీణ నేపథ్యం లో రూపొందే బంగార్రాజు మూవీ లో తన క్యారెక్టర్ కు నయనతార ఇంప్రెస్ అయ్యారని సమాచారం.

కలిసొచ్చిన దర్శకుడితో సూర్య చిత్రం?
కోలీవుడ్ స్టార్ సూర్యకి తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. 1997లో విడుదలైన `నేరక్కు నేర్`తో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ స్టార్ కి... 2001లో వచ్చిన `నంద` చిత్రం నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ తరువాత 2005లో విడుదలైన `గజిని` తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయ్యి... సూర్య స్థాయిని పెంచింది.

శ్రీను వైట్ల సినిమాని కన్‌ఫర్మ్ చేసిన విష్ణు
ఢీ`... మంచు విష్ణు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విష్ణు. ఆ తరువాత `దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` చిత్రాలతోనూ విజయాలు అందుకున్నాడు ఈ మంచు వారి కథానాయకుడు.

వినరా సోదర వీర కుమారా మూవీ తో యూత్ కు ఇచ్చిన సందేశాలు
ఆర్టిస్టుగా 'ఊపిరి', 'గోల్కొండ హైస్కూల్' వంటి చిత్రాల్లో నటించిన శ్రీనివాస్ సాయి హీరోగా.. ప్రియాంక జైన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టీనేజ్ లవ్‌స్టోరీ కథతో సతీష్‌చంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా "వినరా సోదర వీర కుమారా". లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈసినిమా ద్వారా యూత్ కు సతీష్ చంద్ర కొన్ని కీలకమైన విషయాలు కూడా చెప్పారు.

చిత్రలహరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్
బ్లాక్ బస్టర్ మూవీ నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథా నాయికలు కాగా, కామెడీ హీరో సునీల్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'అసురులదర' సాంగ్ పై సూర్య ప్రశంసలు
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రధాన పాత్రలో అక్షర అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుండి 'అసురులదర' అనే పాటను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇటీవల వచ్చిన పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ పాటపై తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ఈ పాట ద్వారా చూపించారు.. గుడ్ లక్ అక్షర టీమ్ అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా దర్శకుడు క్రిష్
సూపర్ హిట్ గమ్యం మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన క్రిష్ మొదటి చిత్రానికే బెస్ట్ డైరెక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి తెలుగు మూవీస్, గబ్బర్ ఈజ్ బ్యాక్ హిందీ మూవీ ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టుల పరాజయం, మణికర్ణిక మూవీ వివాదాలలో చిక్కుకున్న క్రిష్ ఒక కొత్త మూవీ కి స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.

చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా?
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సాయిశ్రీనివాస్ తాజా చిత్రం `సీత` ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతుండగా... మరో వైపు తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ `రాక్షసన్` రీమేక్‌కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. `రైడ్` ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోందని సమాచారం.

బన్నీ-త్రివిక్రమ్... హ్యాట్రిక్ మూవీ అప్‌డేట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాలతో అలరించిన ఈ కాంబో... ఈ సారి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సందడి చేయనుంది. `నాన్న నేను` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు... ఈ వారంలోనే జరుగనున్నాయని సమాచారం. అలాగే... అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది యూనిట్. ఈ మేరకు... బన్నీపై ఓ ఫొటో షూట్ కూడా నిర్వహిస్తున్నారని టాక్.

దిమాక్ ఖరాబ్ అంటున్న ఇస్మార్ట్ శంకర్
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "ఇస్మార్ట్ శంకర్". ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈషెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దిమాక్ ఖరాబ్ అంటూ సాగె ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తోంది.