జీవా `కీ` రిలీజ్ డేట్ ఫిక్స్

Jeeva Key Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jeeva Key Movie Release Date Fixed,Jeeva Key Movie Release Date Revealed,Jeeva Key Movie Release Date Announced,Jeeva Key Movie Gets a Release Date,Jeeva Key Movie Release Date Confirmed,Jeeva Key Movie Latest Updates,Jeeva Key Movie Release Date Unveiled
Jeeva Key Movie Release Date Locked

`రంగం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు జీవా. ఇప్పుడు మరోసారి `కీ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కలీస్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే సుకుమార్ చేతుల మీదగా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో జీవా సరసన నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను కృష్ణ క్రియేష‌న్స్‌, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బేన‌ర్స్ పై నిర్మిస్తున్నారు. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుంది. సాంకేతికత‌లోని మ‌రో కోణాన్ని ట‌చ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మరి రంగం సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టిన జీవాకు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]
[youtube_video videoid=EPhHbH7FR74]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.