యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలలో `బిల్లా` ఒకటి. ఈ సినిమా కోసం ప్రభాస్ తొలిసారిగా అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను మురిపించాడు. అంతేకాదు… రెండు విభిన్న పాత్రల్లో (బిల్లా, రంగా) వేరియేషన్ చూపి మెప్పించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా అనుష్క, నమిత నటించగా ఓ ప్రత్యేక పాత్రలో హన్సిక దర్శనమిచ్చింది. కృష్ణంరాజు, జయసుధ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. ముఖ్యంగా… `బొమ్మాళి` పాట అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. 2009న విడుదలైన `బిల్లా`… నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`బిల్లా` – ప్రత్యేకతలు
* ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రమిది. ఆ తరువాత ఈ ఇద్దరూ `మిర్చి`, `బాహుబలి` సిరీస్‌లో కలసి నటించారు. తెలుగునాట బెస్ట్ పెయిర్స్‌లో స్థానం సంపాదించారు.
* ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో కలసి నటించిన మొదటి సినిమా ఇది. ఆ తరువాత ఈ ఇద్దరూ `రెబల్`లోనూ మురిపించారు. అంతేకాదు… ఈ సినిమాకి కృష్ణంరాజు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం.
* ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమా కోసం ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత `బాహుబలి` సిరీస్‌లోనూ రెండు భిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు.
[youtube_video videoid=bov3ZIOnjQw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: