ATV సమర్పణ లో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సీత మూవీ ఏప్రిల్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. సీత మూవీ లో కీలక మయిన ఒక ప్రత్యేక సాంగ్ ఉంది. ఆప్రత్యేక సాంగ్ లో నటించడానికి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ద్వారా యూత్ లో యెనలేని క్రేజ్ పొందిన పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. బెల్లంకొండ,కాజల్ జంటగా నటించిన రెండవ మూవీ సీత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా పాయల్ రాజ్ పుత్ పై చిత్రీ కరించిన “బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజ్ దూత్ మీదొచ్చే రాం రెడ్డి” సాంగ్ ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ పాయల్ రాజ్ పుత్ నటించిన తొలి ప్రత్యేక సాంగ్. అనూప్ రూబెన్స్ స్వర కల్పనలో సురేంద్ర కృష్ణ రచించిన ఈ గీతాన్ని ఉమా నేహా, తేజ , సంతోష్.జి , అమితో గానం చేశారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఈ స్పెషల్ సాంగ్ గురించి చిత్ర యూనిట్ చెబుతుంది.
[youtube_video videoid=uKmmsIEZR_s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: