నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ పాటలు అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రేమ .. పెళ్లి .. ఆశయం అనే మూడు బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతుంది. మరి ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.
[youtube_video videoid=NWz9pdR3reQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























