తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan To Enter Into Kollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amitabh Bachchan To Enter In Tamil Movies,Big B Entry in Kollywood Movies,Amitabh Bachchan New Movie Updates,Amitabh Bachchan Debut in Tamil Films,Amitabh Bachchan Next in Tamil Film
Amitabh Bachchan To Enter Into Kollywood

అమితాబ్ బచ్చన్… భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గడిచిన 50 సంవత్సరాలుగా తన అసమాన అభినయ ప్రతిభతో ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్నాడు ఈ ఎవర్ గ్రీన్ టాలెంటెడ్ స్టార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా.. దక్షిణాదిలోనూ తనదైన ముద్ర వేశాడు బిగ్ బి. ఇప్పటికే కన్నడ, మలయాళ చిత్రాల్లో మురిపించిన అమితాబ్.. ఇప్పుడు తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదివరకు ‘మనం’లో అతిధి పాత్ర పోషించినా.. ‘సైరా’ లోనే తెలుగు పలుకులకు లిప్ సింక్ ఇవ్వబోతున్నాడు బిగ్ బి.

ఇదిలా ఉంటే… బిగ్ బి దక్షిణాదిలోని మరో చిత్ర పరిశ్రమ అయిన తమిళ సీమలోనూ తొలి అడుగులు వేయబోతున్నాడు.’ ఉయరంద మణిదన్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కి జోడీగా ఓ కీలక పాత్రలో అమితాబ్ దర్శనమివ్వనున్నాడు. అలాగే ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జే.సూర్య ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. కాగా.. అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై అమితానందాన్ని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో బిగ్ బి వర్కింగ్ స్టిల్స్ ను పోస్ట్ చేశాడు సూర్య. తమిళ్ వానన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు హిందీలోనూ ఏక కాలంలో నిర్మితమవుతోంది. మరి… తన తొలి తమిళ చిత్రంతో బిగ్ బి ఏ మేరకు మురిపిస్తాడో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

[subscribe]
[youtube_video videoid=mp_KkZjckjg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =