ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో అయినా ఈ ఉత్కంఠ కు బ్రేక్ పడుతుందేమో అనుకున్నారు కానీ.. మళ్లీ నిరాశే ఎదురురైంది. సినిమా రిలీజ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై ఇటీవల కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఏప్రిల్ 3న సినిమా చూసి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు .. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా.. తాము తీర్పు చెప్పలేమని, సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేశారు. దీంతో ఈరోజు సినిమా రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం వ్యక్తమవుతుందని భావించిన చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో అసలు సినిమా ఎన్నికల ముందు రిలీజ్ అవుతుందా? ఎన్నికల తరువాతే రిలీజ్ అవుతుందా అని మరింత ఉత్కంఠ కొనసాగుతోంది. చూద్దాం మరి ఏప్రిల్ 9 న ఏం జరుగుతుందో…
ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది.
[youtube_video videoid=MlUjnyJJdZ0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: