‘చెక్’ ఇంట్రెస్టింగ్ పాయింట్స్

Here Are A Few Prime Reasons To Watch Check Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nithiin Starrer Check,Actor Nithiin,Hero Nithiin,Check,Check Movie,Check Songs,Check Telugu Movie,Check Movie Telugu,Five Reasons To Watch Nithiin Check,Five Reasons To Watch Check,Five Reasons To Watch Check Movie,Five Reasons To Watch Check Telugu Movie,5 Reasons To Watch Check Movie,5 Reasons To Watch Check,Check Movie Plot,Nithiin Check,Check From Feb 26th,Check Theatrical Release Tomorrow,Check Movie Update,Five Reasons To Watch Check Film,Director Chandra Sekhar Yeleti,Priya Prakash Varrier,Check Music,Check Movie Songs,Ninnu Chudakunda Song,Rakul Preet Singh,Check On Feb 26th,Reasons To Watch Check Movie

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈసారి నితిన్ పూర్తి ఎక్స్ పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో ఆ విషయం అర్ధమైంది. ఈసినిమా కూడా నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అర్థమవుతుంది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలో.. ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎంటో ఒకసారి చూద్దాం.

చంద్రశేఖర్ యేలేటి..ఈ సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది నేషనల్ అవార్డ్ గ్రహీత డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గురించి. ఆయన మేకింగ్ ఎలా ఉంటుంది ఆయన సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’ ఇలాంటి డిఫరెంట్ సినిమాలు తీయాలంటే చంద్రశేఖర్ యేలేటి కే సాధ్యం. ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఇక దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆయన తిరిగి మెగాఫోన్‌ పట్టి చెక్ లాంటి విభిన్నమైన కథతో వస్తున్నాడు.

నితిన్.. నితిన్ తన కెరీర్ స్టార్టింగ్ నుండి చేసిన సినిమాల వల్ల లవర్ బాయ్ ఇమేజ్ నే సొంతం చేసుకున్నాడు. ఈమధ్యనే ఆ సట్రం నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈసారి చెక్ లాంటి సినిమాతో వస్తున్నాడు.

కథ.. జైలు, కోర్టులు వాటి చుట్టూ నడిచే కథలు.. ఈ నేపథ్యంలో ఏన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇది కొంచం డిఫరెంట్ గా కనిపిస్తుంది. దేశద్రోహి కేసు కింద హీరో జైలుకు రావడం.. అతను చెస్ లో ఎక్స్పర్ట్ అవ్వడం.. ఆ చెస్ తోనే కేసు నుండి బయటకు రావాలనుకోవడం.. మధ్యలో వచ్చే ఆటంకాలు ఇది కథ. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి కథ రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్.. ఇప్పటి వరకూ ఎక్కువ గ్లామర్ పాత్రల్లో నటించిన రకుల్ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా లాయర్ పాత్రలో నటిస్తుంది. ఇక మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. వింక్ బ్యూటీ గాా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రియా ఈ సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ కు ప్రేయసిగా నటిస్తుంది ప్రియా. అంతేకాదు నితిన్-ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది.

మ్యూజిక్.. ఇలాంటి సినిమాల్లో పాటలకు పెద్దగా తావు ఉండదు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత హైలైట్ అయితే సినిమాకు అంత ప్లస్. ఇక ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్నాం. కల్యాణి మాలిక్ కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here