ఆర్ట్ డైరెక్టర్ ‘ఆనంద్ సాయి’ పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొంత కాలం విరామం తరువాత ఆయన మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిను ఎంపిక చేశారు చిత్రయూనిట్. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team #PSPK28 Welcome Anand Sai on board as Art Director.#PawanKalyan #HarishShankar @MythriOfficial #TeluguFilmNagar pic.twitter.com/cKYpnOFxjk
— Telugu FilmNagar (@telugufilmnagar) February 25, 2021
కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 28వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.