రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక దీనితో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. రాజాసాబ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తేజ సజ్జా హీరోగా మిరాయ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేయగా ఈ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ ను రాజాసాబ్ సినిమా గురించి అడుగగా.. ఈసినిమా షూటింగ్ జరుగుతుందని.. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్ డేట్లు వస్తాయని.. ఒక స్పెషల్ ఈవెంట్ ద్వాారా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.
Producer @vishwaprasadtg about #TheRajaSaab movie shooting progress and release date!🎥#Prabhas @DirectorMaruthi #TeluguFilmNagar pic.twitter.com/rx0bMUy5Fd
— Telugu FilmNagar (@telugufilmnagar) April 18, 2024
కాగా ఈసినిమాాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: