యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు శ్రీరామి నవమి పండుగ సందర్బంగా తాజాగా ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు అర్థమవుతుంది.
Make way for the conman you’d love to meet ❤🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash @SonyMusicSouth pic.twitter.com/8uARUhDGlX
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: