రజినీకాంత్ బాషా రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

Superstar Rajinikanth's Baasha to be Re-Released In Theaters on May 1st

టాలీవుడ్‌లో గతకొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం మూవీ లవర్స్‌కి తెలిసిన విషయమే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నయా ట్రెండ్ నిర్మాత‌ల‌కు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. అలాగే మ‌రోవైపు ఫ్యాన్స్ కూడా త‌మ అభిమాన హీరోలు సూప‌ర్ హిట్ సినిమాల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదిలావుండగా.. తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి తమిళ్ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ నటించిన మూవీ ఒకటి చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రజినీకాంత్ హీరోగా 1995లో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ‘బాషా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 1వ తేదీన ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా బాషా సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సూపర్‌ హిట్ చిత్రంలో రజినీ సరసన నగ్మా హీరోయిన్‌గా నటించగా.. దివంగత విలక్షణ నటుడు రఘువరన్ ప్రతినాయకుడిగా కనిపించారు.

కాగా తలైవా కెరీర్‌లోనే మెమొరబుల్‌గా నిలిచిపోయే ఫిల్మ్‌గా బాషాకి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో సరికొత్త ఒరవడి సృష్టించిన సినిమాగా బాషాకి పేరుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఒక సామాన్యుడిగా కనిపించడం.. సెకండాఫ్‌లో ఒక్కసారిగా గతంలో అతడి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనలను చూపించి హైప్ తీసుకురావడం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. ఈ సినిమాల తర్వాత వచ్చిన చాలా సినిమాలకు బాషా స్ఫూర్తిగా నిలిచింది. సో.. అలాంటి చిత్రం మళ్ళీ రీ-రిలీజ్ కానుండటంతో మూవీ లవర్స్ దీనిని థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 9 =