దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్ 

tillu square beats dasara life time collections

గుంటూరు కారం,హనుమాన్ తరువాత ఈ ఏడాది 100కోట్ల క్లబ్ లో చేరింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ మౌత్ టాక్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాని దసరా సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.గత ఏడాది సమ్మర్ లో విడుదలైన దసరా 120కోట్లు రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఆ కలెక్షన్స్ ను దాటేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా రిలీజ్ లేకుండా టిల్లు స్క్వేర్ ఈ ఫీట్ సాధించింది.ఇప్పటికి ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అటు ఓవర్సీస్ లో 3మిలియన్ మార్క్ ను చేరువైంది.ఈఏడాది హనుమాన్ తరువాత భారీ లాభాలను తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే.ఇక ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఈనెల చివరి వారం లో లేదా మే మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.

సిద్దు జొన్నలగ్గడ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఇక టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ కావడంతో ఈసినిమాకు కూడా సీక్వెల్ రానుంది.టిల్లు క్యూబ్ తో థర్డ్ పార్ట్ తెరకెక్కనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =