మలయాళం స్టార్ హీరో దుల్కర్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు అప్ డేట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
A Common… Middle Class… Indian Man! 💰
Dive into the extra-ordinary world of #LuckyBaskhar! 🏦💥#LuckyBaskharTeaser ▶️ https://t.co/PIYHj0ojpJ@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/zqCP1QLpjO
— Sithara Entertainments (@SitharaEnts) April 11, 2024
కాగా ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: