గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Gopichand and Sreenu Vaitla viswam movie first strike out now

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా నుండి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి.. ఏప్రిల్ 11న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక చెప్పినట్టే రంజాన్ పండుగ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ప్రకటిస్తూనే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. విశ్వం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ కూడా ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో ఓ పెళ్లి దగ్గరికి వచ్చి గోపీచంద్ అందర్నీ కాల్చేసి చంపేస్తాడు. తర్వాత బిర్యానీ తింటూ.. ప్రతి అన్నం మెతుకు మీద అది ఎవరు తినాలో రాసి పెట్టి ఉంటుంది. దీనిపై నా పేరు రాసిపెట్టి ఉంది అని డైలాగ్ చెబుతాడు.

కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =