గోల్కొండ హై స్కూల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతోష్ శోభన్ తను మను సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేస్తూ హీరోగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే టీజర్, పోస్టర్లతో సినిమాను మంచి బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రయూనిట్ ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు ముఖ్య అతిథులుగా న్యాచురల్ స్టార్ నాని, మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వీరిద్దరూ స్వప్నా మూవీస్ బ్యానర్స్ లో సూపర్ హిట్లను కొట్టినవాళ్లే.
మా కోసం మా మంచి శకునాలు…💚💫
Our dearest @NameisNani & @dulQuer will be gracing #AMSPreReleaseEvent, Tomorrow from 6 PM.🔗 https://t.co/XhCLzbh9pD#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @SonyMusicSouth pic.twitter.com/YQ2mLC8Qqc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 13, 2023
కాగాస్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: