గోపిచంద్ 32కి లైన్ క్లియర్ 

Chitralayam joins hands with the people media factory for Gopichand 32

మ్యాచో హీరో గోపిచంద్ ,డైరెక్టర్  శ్రీను వైట్ల తో తన 32వ సినిమాను చేస్తున్నాడని తెలిసిందే.ఇటీవలే ఇటలీ లో కీలకమైన షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ ఫై వేణు దోనేపూడి నిర్మాణంలో ఈసీనిమా స్టార్ట్ అయ్యింది.అయితే బడ్జెట్ సమస్యల వల్ల మధ్యలో  షూటింగ్ కొద్దీ రోజులు హోల్డ్ లో పెట్టారు.ఇక ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈసినిమా నిర్మాణంలో భాగస్వామి కావడానికి ముందుకు రావడంతో ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోయాయి.దాంతో రేపటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో లాస్ట్ టాకీ పార్ట్ ను షూట్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా  నటిస్తుండగా చైతన్య భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ,గోపిమెహన్ స్క్రీన్ ప్లే  అందిస్తున్నారు.ఈఏడాది సెకండ్ హాఫ్ లో ఈసినిమాను విడుదలచేయనున్నారు.

ఇక ఈసినిమా విజయం శ్రీను వైట్లకు అలాగే గోపిచంద్ కి కీలకం కానుంది.గోపిచంద్ రీసెంట్ గా భీమా అనే సినిమాతో వచ్చాడు అయితే ఇంతకుముందు గోపిచంద్ సినిమాలకన్నా ఈసినిమా బెటర్ అనిపించుకుంది కానీ తనకు కావాల్సిన సాలిడ్ హిట్ ను ఇవ్వలేకపోయింది.అటు శ్రీను వైట్లకు బాద్షా తరువాత సరైన హిట్ దక్కలేదు.దాంతో గోపిచంద్ 32తో హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో వున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =