నాని సినిమా ఏదైనా చెప్పండి, చూస్తాను – బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

British Deputy Commissioner of Telugu States Gareth Wynn Owen Meets Hero Nani Telugu Filmnagar

టాలీవుడ్ స్టార్ హీరోలలో నాని స్టయిలే వేరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగిన ఈ తరం నటుల్లో ఆయన ముందుంటారు. చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని.. తనదైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో సైతం అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఒకరు చేరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు గారెత్ విన్ ఓవెన్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హీరో నానిని కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్ విన్, నానితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ మేరకు విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా నేచురల్ స్టార్‌ని కలవడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ ఎక్స్‌లో ఇలా తెలిపారు.. “హీరో నానిని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన సినీ కెరీర్ మరియు పర్సనల్ లైఫ్ గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే టాలీవుడ్‌తో సంబంధాలను బ్రిటన్ ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు? అనే అంశంపై గురించి నానితో చర్చించాను. ఈ సందర్భంగా, తాను నటించిన రెండు సినిమాలు చూడమని నాని నాకు సూచించారు. మరి నేచురల్ స్టార్ నటించిన ఏ సినిమాలు చూడాలో నాకు కాస్త చెబుతారా..?” అని గారెత్ విన్ ఓవెన్ నెటిజన్లను కోరారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =