మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో ఓ కీ రోల్ కోసం నన్ను అడిగారు. అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నా అందుకే నటించలేకపోతున్నా అని ఆ విషయాన్ని ఆయనకు వివరించాను” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఆ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ ను నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చిరంజీవి గారు అన్నారు నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అని. మీ సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని హంబుల్‍గా చెప్పాను. ఆ తర్వాత కూడా చిరంజీవి గారు రెగ్యులర్‌గా మెసేజెస్ పంపుతూ ఉండేవారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. ఫ్యూచర్‌లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తా” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: