గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి- మోత మోగిపోయే మాస్ సాంగ్ కు డేట్ ఫిక్స్

motha mass song update from Gangs of Godavari Movie

యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మళ్లీ. దీనిలో భాగంగానే పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి సుట్టంలా సూసి పోకలా అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాట ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుందో చూశాం. ఇప్పుడు మరో మాస్ సాంగ్ కు టైమ్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మోత అనే మాస్ బీట్ సాంగ్ ను మార్చి 25వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి  హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =