కెరీర్ మొదటినుండి కాస్త డిఫరెంట్ సినిమాలు తీయడంలో ముందు ఉండేవాడు శ్రీ విష్ణు. అంతేకాదు కామెడీ ఎంటర్ టైనర్ లు కూడా తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు..ఇక ఇప్పుడు మరోసారి ఓం భీమ్ బుష్ హిట్ ను అందుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈసినిమా అప్ డేట్లతోనే మంచి క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 4.6 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక యూఎస్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది. అక్కడ 175 కే డాలర్లను సొంతం చేసుకుంది.
A BANG AT THE BOX OFFICE 💥💥💥#OmBheemBush collects a gross of 4.6 CRORES+ on Day 1 worldwide ❤🔥
Start off on a terrific note with $175K gross at the US Box Office ✨
Book your tickets for the laugh riot in cinemas ❤️🔥
🎟️ https://t.co/lwRisfj1xMDirected by… pic.twitter.com/R5btow5PnN
— UV Creations (@UV_Creations) March 23, 2024
కాగా ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పించిన ఈసినిమాను వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: