కంగువ టీజర్ రైస్పాన్స్ పై డైరెక్టర్ రియాక్షన్

director siva interesting post on suriyas kanguva teaser response

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా టీజర్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. సూర్య నటన, విజువల్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై డైరెక్టర్ శివ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. కంగువ సిజిల్ టీజర్ ను ఇంతలా ఆదరిస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. హీరో సూర్య గారికి, జ్ఞానవేల్ రాజా గారికి ప్రత్యేకంగా థాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twelve =