రివ్యూ : ఓం భీమ్ బుష్ 

Om Bheem Bush telugu review

నటినటులు : శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి,అయేషా ఖాన్
ఎడిటింగ్ : విజయ్ వర్ధన్
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
సంగీతం : సన్నీ ఎమ్ ఆర్
దర్శకత్వం : శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాతలు : యూవీ క్రియేషన్స్, సునీల్ బలుసు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రచార చిత్రాలు ,క్యాస్టింగ్ తో మంచి హైప్ తెచ్చుకుంది ఓం భీమ్ బుష్.కామెడీ త్రయం శ్రీవిష్ణు,రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు.నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో వచ్చింది.ట్రైలర్ లోనే చెప్పేశారు సినిమా ఎలావుండనుందో.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ: 
బ్యాంగ్ బ్రదర్స్ అయినా క్రిష్ (శ్రీ విష్ణు), మ్యాడ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ ),వినయ్  గుమ్మడి ( ప్రియదర్శి) పిహెచ్ డి తో  డాక్టరేట్ ను పొంది భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడుతారు.తమను తాము సైంటిస్టులు గా ప్రకటించుకొని ఆ ఊర్లో ఏ టు జెడ్ అనే దుకాణం పెట్టి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని ప్రచారం చేసుకుంటారు.అయితే వీళ్లు నిజమైన సైంటిస్టులు కాదని బయటపడడం తో ఆ  ఊరి సర్పంచ్ ఈ ముగ్గురికి ఓ టాస్క్ ఇస్తాడు. ఇంతకీ అదేంటంటే సంపంగి మహల్ లో వున్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే మీరు నిజమైన సైంటిస్టులు అని నమ్ముతామని సర్పంచ్ చెపుతాడు.దాంతో ఈ ముగ్గురు ఆ నిధి కోసం సంపంగి మహల్ కు వెళ్తారు. ఆ తరువాత ఏమైంది? ఇంతకీ నిధి దొరికిందా లేదా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

కథాపరంగా చూస్తే  కొత్తదనం ఏమి ఉండదు కానీ  ఎక్కడా బోర్ కొట్టడం కూడా రెండు గంటలు నవ్వుకునేలా తెర మీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్.నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని తీసిన సినిమా ఇది ఇందులో లాజిక్ లు వెతికిదే మాత్రం ఎంజాయ్ చేయలేరు అందుకే ముందే చెప్పేశారు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని.సో  కామెడీ కోసం మాత్రమే అయితే సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

మెయిన్ గా  శ్రీ విష్ణు, రాహుల్ ,ప్రియదర్శి ల కెమిస్ట్రీ సినిమా కు ప్రధాన బలం.శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అయితే సామజవరగమనలోనే చూశాం ఇక ఇందులో ఆ టైమింగ్ మరింతగా నచ్చుతుంది.సెకండ్ హాఫ్ లో  దెయ్యం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్లు భయపెట్టి థ్రిల్ చేస్తాయి.కొన్ని కొన్ని చోట్ల రొటీన్ అనిపిస్తాయి. ఓవరాల్ గా పక్కా లాజిక్ లెస్ కామెడీ ఎంటర్టైనర్ ఇది.

నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు,రాహుల్ ,ప్రియదర్శి ఈ ముగ్గురు చాలా సహజంగా తమ పాత్రలను చేసి నవ్వించారు.సింగిల్ లైన్ పంచులు బాగా పేలాయి.ఇక హీరోయిన్లు గా నటించిన అయేషా ఖాన్ , ప్రీతి ముకుందన్ కనిపించింది తక్కువ సేపే అయినా మెప్పించారు.మిగితా పాత్రల్లో నటించిన ప్రియా వడ్లమాని,శ్రీకాంత్ అయ్యంగార్,రచ్చ రవి,ఆదిత్య మేనన్ తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ కు ఈ విషయంలోకూడా మంచి సపోర్ట్ దొరికింది.సినిమాటోగ్రఫీ ,షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అంతగా రిజిస్టర్ కావు కానీ  బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా వున్నాయి.

ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఓం భీం బుష్.ఇందులో లాజిక్ లు వెతుక్కోకుండా సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.కామెడీ సినిమాలను ఇష్ట పడే వారికి ఈసినిమా సూపర్ అనిపిస్తుంది.మిగితా వారిని కూడా టైం పాస్ చేయిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =